దళితవాడని పట్టించుకోండి ప్లీజ్: దళిత ప్రజల వేడుకోలు

దళితవాడని పట్టించుకోండి ప్లీజ్: దళిత ప్రజల వేడుకోలు

ముద్ర, సంస్ధాన్ నారాయణపురం: నారాయణపురం గ్రామంలో ఎంపీటీసీ 2 పరిధిలోని 14 వ వార్డులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం దగ్గర రోడ్డు ప్రమాదంగా మారింది. నీటి పైపులైన్ లు ఇష్టంవచ్చినట్టు వేసుకుంటూ పోయి గుంతలను పుడ్చకుండ మరిచారు. మోరిలో నుంచి అడ్డంగా మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడంతో మోరీలో చెత్తంతా జమ అయితుంది. ఇది రహదారి వెంటే ఉండడం నాలుగు దారులు కలిసిన ప్రధాన కుడలి కావడంతో నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి.

దురదృష్టవశాత్తు వాహనం అదుపుతప్పిందో ప్రాణాలు పోయినట్టే. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదంటున్నారు కాలనీవాసులు. దానికి పక్కనే నీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంది అక్కడే గుంతగా ఏర్పడి నీరు నిల్వ ఉండడంతో నీరు కలుషితమై మళ్ళీ పైపులకు వెళ్లి ఇంటింటికి వెళ్లడం ద్వారా కాలనీలోని ప్రజలు అనారోగ్యబారిన పడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వాడలో సిసి రోడ్లు కూడా వేయాల్సి ఉంది. అధికారులు వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించాలని గుంతలను పూడ్చి,నీటి పైపు లైన్ ను మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు కాలనీవాసులు.