గత కలెక్టర్ కు ఒక నెల జైలు శిక్ష విధింపు

గత కలెక్టర్ కు ఒక నెల జైలు శిక్ష విధింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గతంలో నిర్మల్ కలెక్టర్ గా పని చేసిన ముషారఫ్ ఆలీ ఫారూఖీ కి కోర్టు ధిక్కరణ నేరం క్రింద నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తెలంగాణా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీ దేవి తీర్పు ఇచ్చారు. అలాగే నిర్మల్ మునిసిపల్ కమిషనర్ కు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

సయ్యద్ శాఖీర్ అహ్మద్ సహా మరో 43 మంది కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ లపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. 44 మంది 4వ తరగతి ఉద్యోగులకు వారు పని చేసిన కాలానికి వేతనాలు మూడు వారాల్లోగా ఇవ్వాలని  గతంలో కోర్టు ఆదేశించింది. ఐతే  కలెక్టర్, కమిషనర్ లు వారు సదరు కాలంలో పని చేయలేదని వేతనాలు ఆపివేశారు.  తాము వారి పనిని నిర్ధారించిన అనంతరమే వేతనాలు చెల్లించాలని ఆదేశించినా, కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు వారికి ఈ శిక్ష విధించారు.