జర్నలిస్ట్ మధు సూధన్ రెడ్డి పై అక్రమ కేసులు ఎత్తి వేయాలి 

జర్నలిస్ట్ మధు సూధన్ రెడ్డి పై అక్రమ కేసులు ఎత్తి వేయాలి 
  • ఎస్పీకి వినతి పత్రం అందించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల ఓ పత్రిక రిపోర్టర్ మధు సూధన్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని జిల్లా ఎస్పీకి జర్నలిస్టులు గురువారం వినతిపత్రం అందించారు. కక్ష సాధింపుగా అక్రమ కేసులు పెట్టించారని  అట్టి కేసులను ఎత్తివేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో,వీడియో జర్నలిస్టుల ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కు వినతిపత్రం అందించి ఈ సంఘటనకు సంబంధించి పలు అంశాలను చర్చించారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.వెల్గొండ గ్రామానికి చెందిన ఓ మహిళను పావుగా చేసుకుని కొందరు వ్యక్తులు మధుసూదన్ రెడ్డి పై కక్ష సాధింపుతో పోలీసులకు ఫిర్యాదు చేయించి అక్రమ కేసు బనాయించారని ఎస్పి దృష్టికి తీసుకొచ్చారు.జర్నలిస్టుగా అతను వార్తలు రాయడాన్ని కొందరు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెట్టించారనీ వారు పేర్కొన్నారు. అత్యాచారయత్నం,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బిజినెపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు చేయించారని ఎస్పీకి తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు చేసిన రోజు గ్రామస్తులతో కలిసి మధుసూదన్ రెడ్డి గ్రామంలోనే ఉన్నాడని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

జర్నలిస్టు మధుసూదన్ రెడ్డికి మద్దతుగా వేల్గొండ గ్రామస్తులు అందరూ బిజినపల్లి లో ఆందోళన చేసిన విషయం ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. కక్ష సాధింపు తో అక్రమంగా మధుసూదన్ రెడ్డి పై పెట్టిన కేసులు తొలగించాలని కోరుతూ ఎస్పీకి వినతిపత్రం అందించారు. ఎస్పీని కలిసి వినతిపత్రం అందించిన వారిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు....