జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించాలి
  • టీయూడబ్ల్యూజే ఐజేయు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-జర్నలిస్టుల సమస్యలు  పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే, ఐజేయు అనుబంధం) జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్ అధ్వంలో సోమవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఆగస్టు నెల బీహార్ లో ఐజేయు సమావేశంలో తీర్మానించిన విధంగా సోమవారం దేశవ్యాప్త నిరసనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో  మాట్లాడారు. ఇప్పటికీ వందలాది మంది జర్నలిస్టులకు ఇండ్లు గాని ఇంటి స్థలాలు గాని లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి అర్హులైన అందరూ జర్నలిస్టులకు ఇండ్లు ఇంటి స్థలాలు అందజేయాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు నిష్ప్రయోజనంగా మారాయని, అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రయాణానికి అనుమతి ఇచ్చేలా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇంకా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందివ్వాలని  కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణదాసు, అశోక్, జిల్లా దాడుల నివారణ కమిటీ కో కన్వీనర్ చింతకింది చంద్ర మొగిలి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెల్లి మల్లేశం, కొండ లింగమూర్తి యాదవ్, ఎండి గౌస్ బాషా, పెద్దపల్లి మండల శాఖ అధ్యక్షులు వీరమల్ల విద్యాసాగర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, జర్నలిస్టులు కే ప్రవీణ్ రెడ్డి, అడిచర్ల రమేష్, రవికుమార్, జిలకర రమేష్, ముఖేష్, కలవేన రాజేందర్, కొలిపాక కృష్ణ, కొమిరిశెట్టి శ్రీనివాస్, ముత్యాల కృష్ణమూర్తి, జాపతి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.