మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ప్రియదర్శిని

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ప్రియదర్శిని

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోతే నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామనిబి ఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని అన్నారు. చిట్యాల మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌ను నివారించడం తోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సర్కారు కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సకాలంలో బిల్లులు, వేతనాలు ఇవ్వాలని  సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో  సిగ్గు చేటు అన్నారు. జిల్లాలో  కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్న భోజన నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది అని అన్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు వంట కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారాని ,గతంలో ఇచ్చిన హామీలు, జీవోలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే  కార్మికులు సమ్మెబాట పట్టారాని అన్నారు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో అప్పుల పాలవుతున్నామని కార్మికులు పేర్కొంటున్నారు అని అన్నారు. కనీస వేతనం 26000  వేల వేతనం ఇవ్వాలని, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకులన్ని ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్‌లను తగ్గించే దిశగా మొదలైన మధ్యాహ్న భోజన పథకం సత్ఫలితాలిస్తున్నా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అల్పాహారం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం వారు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన 12 డిమాండ్లను తీర్చకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,మండల అధ్యక్షులు గ్యార శేఖర్, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, జోగు శేఖర్, జోగు యోగి మధ్యాహ్న భోజన కార్మికులు బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.