ఉమ్మడి పౌరస్మృతి దేశం హక్కు !

ఉమ్మడి పౌరస్మృతి దేశం హక్కు !
The right of a common civic memory country!

ఉమ్మడి పౌరస్మృతి విషయంలో రాజకీయపార్టీలు అనుసరిస్తున్న తీరు దేశద్రోహ చర్యగానే భావించాలి. ఎందుకంటే ఏ దేశంలో అయినా ప్రజలందరికీ ఒకేరకమైన హక్కులు ఉంటాయి. ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. కానీ ఏం దౌర్భాగ్యమో భారత్‌లో మాత్రమే ఇలా వేర్వేరుగా చట్టాలు ఉంటాయి. ఉండాలని కొన్ని  పార్టీలు కోరుకుంటున్నాయి కూడా. చట్టాలు ఒకేరకంగా ఉండడానికి వీలులేదన్న కుత్సిత భావనలో రాజకీయ పార్టీల నేతలు ఆలోచిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో  కొన్ని పార్టీలు ఆడుతున్న నాటకాలు దేశాన్ని విచ్చిన్నం చేయడానికి తప్ప మరోటి కాదు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును బీజేపీ ఎంపీ కిరోడిలాల్‌ మీనా  రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు వైవిధ్యమైన భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ బిల్లు ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై ఓటింగ్‌ నిర్వహించారు. 63 మంది అనుకూలంగా, 23 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో మెజారిటీ ప్రకారం బిల్లును ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా జాతీయ దర్యాప్తు, పరిశోధన కమిటీకి బిల్లును రూపొందించే బాధ్యత అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేలా చూడాలని కిరోడి లాల్‌ విన్నవించారు. గతంలోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం చూసింది. కానీ, కుదరలేదు. దాంతో పూర్తి మెజారిటీతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలన్నది బిల్లు లక్ష్యం. నిజానికి మతాచారాలు ఎవరికి వారు నిర్వహించుకోవచ్చు. కాని పెండ్లిళ్లు, విడాకులు, వారసత్వం, దత్తత, జీవన భృతి  అంటే..భరణం, మనోవర్తి, ఇతరత్రా మొదలైన అన్ని అంశాల్లో కుల, మత, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలి. నిజానికి దేశంలో ఇప్పటి వరకు మతపరమైన చట్టాలే ఉన్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్‌ చట్టాలు అమలవుతున్నాయి. వీటివల్ల ఎన్ని గందరగోళాలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందరిదీ ఒకే రక్తం అంటున్న వారు అందరికీ ఒకే రకమైన న్యాయం,చట్టం ఉండాలన్న సోయిని మరచి వ్యవహరిస్తున్నారు. మన దేశం ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని, సర్వమత సమానత్వాన్ని పాటించాలని, అన్ని భాషలను గుర్తించి గౌరవించాలని రాజ్యాంగంలో అనేక అంశాలను చేర్చారు. కానీ ఇన్నేళ్లయినా కుల మతాల కారణంగా ప్రజలందరూ భయం భయంగా బతికే వాతావరణం దేశంలో చూస్తున్నాం. కులమతాలు వారి ఆచార వ్యవహారాలు ఇంటికే పరిమితం కావాలి. చట్టం ముందు అంతా ఒక్కటే అన్న భావన రావాలి. అంటే ఉమ్మడి పౌరస్మృతి ద్వారానే ఇది సాధ్యం అవుతుంది.  భారత దేశ సమగ్రతను, సమ భావాన్ని గౌరవించే వాళ్ళందరూ ఏకోన్ముఖంగా పౌరస్మృతిని కోరాల్సిందే.  భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా అమలు కావాలంటే ఏకభావన రావాలి. సమాన హక్కులు ఉండాలి. ప్రజలంతా ఒక్కటే అన్న భావన పాదుకొల్పాలి. ఇంకా పేదలను పేదలుగా, మైనార్టీలను ఇంకోరకంగా చూసే సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ మనమంతా ఒక్కటే అన్న భావన కోసం చేసే ఎలాంటి ప్రయత్నాన్ని