చలసాని ఫౌండేషన్ సేవలు హర్షణీయం

చలసాని ఫౌండేషన్ సేవలు హర్షణీయం
  • కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి.  

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-యువత విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయని  ఎఐసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి అన్నారు. ‌చలసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం హర్షణీయమని అన్నారు.

సూర్యాపేట పట్టణంలోని పాత ఎస్పీ కార్యాలయం వద్ద చలసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ఉదయం ప్రముఖ  పాత్రికేయులు, టి యు డబ్ల్యు జె ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ ఆర్ ఐ చలసాని రాజీవ్ కు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ఎందరో ఎన్.ఆర్.ఐ లు ఉన్నప్పటికీ చలసాని రాజీవ్ తను పుట్టిన, పెరిగిన ప్రాంతంలోని అసహా యులను, నిరుపేదలను ఆదుకొని వారికి ఎల్లవేళలా అండగా నిలవడం నిజంగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని చలసాని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే సూర్యాపేట నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటామని అన్నారు.

చలసాని ఫౌండేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ చలసాని రాజీవ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నామని, ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవడం జరుగుతుందని, తమకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో పర్యటిస్తూ ఆపదలో ఉన్న వారి వివరాలు సేకరిస్తూ తక్షణ సహాయం చేస్తున్నామని ఆపదలో ఉన్నవారు చలసాని ఫౌండేషన్ ను సంప్రదించవచ్చు ఆని అన్నారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, నాయకులు శనగాని రాంబాబు గౌడ్, రెబల్ శ్రీను, గవ్వ క్ర్రష్ణారెడ్డి, జైపాల్ రెడ్డి, చలసాని ఫౌండేషన్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.