గ్రామీణ వైద్యుల సేవలు వెలకట్టలేనివి

గ్రామీణ వైద్యుల సేవలు వెలకట్టలేనివి

గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి 
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 6వ జిల్లా మహాసభ లో.. ప్రభుత్వ విప్ రేగా

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం మారుమూల గ్రామాల్లో అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యుల సేవలు వెలకట్టలేని వని ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం పాల్వంచ పట్టణం లోని పెద్దమ్మ తల్లి గుడి ప్రాంగణం నందు గల ఎస్సార్  ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 6వ జిల్లా మహాసభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు  గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు, గ్రామాలలో ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స చేసి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు, ప్రాణాలు కాపాడడానికి ప్రధమ చికిత్స ముఖ్యమని అన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరపున శిక్షణ అందించి వారి సేవలను మెరుగుపరుస్తామన్నారు .ప్రభుత్వ సంక్షేమ పథకాలలో గ్రామీణ వైద్యులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు .సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్  వెంట గ్రామీణ వైద్యులు నడవాలన్నారు .గ్రామీణ వైద్యులకు అండగా ఉంటానన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్  మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాలబోయిన వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ చారి ఉపాధ్యక్షులు కందుకూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి నటరాజ్ , శ్రీరామ్ కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ వర్మ ,రాష్ట్ర నాయకులు నేతి రాజేశ్వరరావు, రేగుముడి వెంకటేశ్వర్లు కరుణాకర్, ప్రభాకర్, జివి రావు, కోట సత్యం తదితరులు పాల్గొన్నారు.