మద్యం మత్తులో తండ్రిని బలిగొన్న కొడుకు ... చికిత్స పొందుతూ మృతి
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- మద్యం మత్తులో కొడుకు తండ్రిని బలిగొన్న ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం ఎల్లయ్య (45) ఇనుప సామాను బేరం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు.
గత నెల 25 న గ్రామంలో బోనాల పండగ సందర్భంగా పర్వతం ఎల్లయ్య మద్యం సేవించి తన కుమారుడైన పర్వతం శ్రీశైలం ను ఇష్టానుసారంగా తిట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీశైలం క్షణికావేశంలో తండ్రిని కాళ్లతో కడుపులో తన్ని చితకబాదాడు. తండ్రి స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పర్వతం ఎల్లయ్య సోమవారం మృతి చెందాడు .మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.