దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుంది
  • సమాచార పౌర సంబంధాలు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

ముద్ర, షాబాద్:-ఏ రాష్ట్రంలో లేనివిధంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని సమాచార, పౌర సంబంధాలు,  గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారూ. దేశ చిత్ర పటంలో నిలిచేలా  షాబాద్ ప్రాంతాన్ని  పరిశ్రమల ను నేలకొల్పేలా  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసారని అయన పేర్కొన్నారు.మంగళవారం షాబాద్ మండలం కొమరబండ గ్రామంలో రూ. 5  కోట్ల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న బ్రిడ్జి పనులకు సమాచార, పౌర సంబంధాలు & గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతు కర్ణాటక, మహారాష్ట్ర వంటిి  కాంగ్రెస్, బీజేపీ పరిపాలిత  రాష్ట్రాలలో దళిత బంధు ఉందా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ ల రైతులకు పెట్టుబడి సహాయం  అనేది వేరే రాష్ట్రాలలో కనిపించవని అన్నారు. మహిళలకు కల్పించే అవకాశాలు,  కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు  వెరే రాష్ట్రాలలలో ఉండవని అన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిక్లరేషన్ 
ప్రజలను మభ్య పెట్టే విధంగా ఉన్నాయని విమర్శించారు.ఓర్వలేక ప్రతిపక్షాలు ధరణి మీద విమర్శలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి మండిపడ్డారు.రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి ఊహించలేని విధంగా సాగుతుందని మహేందర్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్లు, బ్రిడ్జి కోసం రూ. 124 కోట్లు నిధులు,  చేవెళ్ల నియోజకవర్గానికి రూ. 52 కోట్లు అందించమని అన్నారు.

ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతు రాష్ట్రంలో గులాబీ ప్రభుత్వం చేస్తున్న పథకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క చేస్తున్న విమర్శలు సముచితం కాదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఉంటెచూపాలని మల్లికార్జున ఖర్గే ను ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పటి ఎన్నికల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను ఓడించేందుకు అభ్యర్థిని బరిలో నిలిపిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల కోసం మాట్లాడడం సిగ్గుచేటు అని రంజిత్ రెడ్డి అన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చూపాలని రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్ర పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తున్నారని రంజిత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్  పార్టీ చెప్పింది  చేస్తుంది చేసి చూపిస్తుందని రంజిత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతు అభివృద్ధి, పనితనం చూసి ప్రజలు మద్దతు ఇస్తారని అన్నారు.దళిత బందు అర్హులైన వారికి కేటాయిస్తామని అనవసరమైన వివాదాలు ప్రతిపక్షాలు సృష్టిస్తే సహించేది లేద ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.ఈ కార్యక్రమములో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, షాబాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి మహేందర్ రెడ్డి తడితరులు పాల్గొన్నారు.