ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు..

ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు..

క్షతగాత్రుల వివరాల మేరకు... హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు బస్సుకూ మంటలు వ్యాపించాయి.ప్రమాదంలో ఐదుగురు సంజీవ దహనం అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.