రెండో లైన్ పై ట్రయల్ రన్ సక్సెస్...
కేసముద్రం, ముద్ర: వరదలతో మహబూబాబాద్ - నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. తాళ్లపూస పల్లి వద్ద మంగళవారం సాయంత్రం ట్రైల్ రన్ నిర్వహించారు. ఇంటి కన్నా వద్ద బుధవారం ఉదయం ట్రైల్ రన్ నిర్వహించారు. ఆదివారం రాత్రి కేసముద్రంలో నిలిచిపోయిన గూడ్స్ రైలును డోర్నకల్ వైపు ట్రైల్ రన్ నిర్వహించారు. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కాళీ భోగిలతో మూడు రోజులపాటు కేసముద్రంలో నిలిచిన రైలును వరంగల్ వైపు ట్రైల్ రన్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి వివిధ రైళ్లను దెబ్బతిన్న ట్రాక్ వద్ద వేగం తగ్గించి నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.