ముద్దెంగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడమే అంతిమ లక్ష్యం: జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి 

ముద్దెంగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడమే అంతిమ లక్ష్యం: జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి 
The ultimate goal is to make Muddenguda a model village ZPTC Patnam Avinash Reddy

షాబాద్, ముద్ర: షాబాద్ మండలంలోని ముద్దెంగూడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడమే తమ అంతిమ లక్ష్యమని జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. రూ. 12 లక్షల నిధులతో చేపట్టిన సిసి రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణాలకు జడ్పిటిసి స్థానిక సర్పంచ్ జయ్యమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు ఏళ్లలో సుమారు రూ.40లక్షల నిధులను ఆయా పథకాల కింద అందించినట్లు వివరించారు. ఇందులో భాగంగానే రూ.7 లక్షల నిధులను సిసి రోడ్లకు, రూ.5 లక్షల నిధులను మురుగు కాలువలకు కేటాయించినట్లు వివరించారు.

అదేవిధంగా షాబాద్ నుండి ముద్దెంగూడను కలిపే రోడ్డును రీబిటి చేస్తామని,  శివాలయం అభివృద్ధికి సొంత డబ్బులను అందిస్తామని హామీ ఇచ్చారు. ముద్దెంగూడ - ఎర్రోనిగూడ ఫార్మేషన్ రోడ్డును వెంటనే చేయిస్తామన్నారు. సర్పంచ్ జయమ్మ, ఉపసర్పంచ్ ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు భూపతి రాజేందర్,  మాజీ ఎంపీపీ కూర వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సిములు, సీనియర్ నాయకులు సుదర్శన్,  పురుషోత్తం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.