బడుగు వర్గాల అభ్యున్నతి రాజ్యాంగం తోనే సాధ్యమైంది

బడుగు వర్గాల అభ్యున్నతి రాజ్యాంగం తోనే సాధ్యమైంది

నార్సింగిలో అంబేద్కర్ కు ఘనంగా నివాళి

ముద్ర, రాజేంద్రనగర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో పలువురు నాయకులు, అధికారులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్యాతం అశోక్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. భావితరాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఖానాపూర్ లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పి. కిషన్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను సాకారం చేసే దిశలో ముందుకు వెళుతుంది అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు డి. కిరణ్, రాము, ప్రభు, మాజీ సర్పంచులు ఆర్. నరసింహ, గండయ్య ముదిరాజ్ తదితరులు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మోహన్ రావు, లచ్చిరాం తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.