పేద ప్రజల సంక్షేమమే బి ఆర్ ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

పేద ప్రజల సంక్షేమమే బి ఆర్ ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పేద ప్రజల సంక్షేమమే బి ఆర్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని కల్లెడ, సోమన్‌ఫెల్లి, సంఘంపెల్లి, హబ్సీపూర్‌, తక్కల్లపెల్లి గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి డా. సంజయ్‌కుమార్‌ సోమవారం కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించి బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ది పనులు, అందించిన సంక్షేమ కార్యక్రామల గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి రెండో సారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉందని, పెంచిన పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మిలకు పెన్షన్‌లు, బడుల్లో సన్నబియ్యంతో మద్యాహ్న భోజనం వంటి పథకాలే బీఆర్‌ఎస్ పేదల పక్షపాతి అని రుజువు చేస్తున్నాయని అన్నారు.

60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, 40ఏండ్ల నుండి ఉన్న జీవన్‌రెడ్డి పేదల గురించి ఎందుకు ఆలోచించలేదు...పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు....మేం పదేండ్ల నుండి కళ్యాణలక్ష్మీ అమలు పరుస్తుంటే మీకు ఇప్పుడు యాదికచ్చిందా...ఇన్నేండ్లేంచేసిండ్రని ప్రశ్నించారు. ఎవరూ అడుగకున్నా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్‌ రాని మహిళలందరికి సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా పెన్షన్‌ అందిస్తామని, ఎటువంటి ఆధారం లేని వారికి కేసీఆర్‌ బీమా పేరుతో రూ. 5లక్షల బీమాను అందిస్తామన్నారు. గతంలో కరంటు ఎట్లుండెనో అందరు గుర్తుంచుకోవాలి...కరంటు కష్టాలు మల్లా రావద్దంటే బీఆర్‌ఎస్నే గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రావు, ఎల్ల రెడ్డి, సందీప్ రావు, దావా సురేష్, బాల ముకుందం, రవీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.