న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

న్యాయం చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

ముద్ర నడిగూడెం:-నడిగూడెం  మండల కేంద్రంలో గాంధీ పార్క్ లో ఉన్న  మంచినీటి వాటర్ ట్యాంక్ ను గుంజ అచ్చమ్మ ఎక్కిన సంఘటన గురువారం తెల్లవారుజామున  కలకలం రేపింది. నవంబర్ నెల భార్యాభర్తల పంచాయతీలో రౌడీ మూకల దాడిలో తీవ్ర గాయాల పాలైన తన కొడుకు గుంజ ఎల్లయ్య కోమాలోకి వెళ్ళటం, తన కొడుకును ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిన వారిపై కేసులు పెట్టినా పోలీసులు తమకు న్యాయం చేయట్లేదని మండల కేంద్రంలో గల  ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఏడుకొండలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని, దాడి చేసిన వారిని తప్పక అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ అచ్చమ్మను కిందకు దించారు. సంఘటన స్థలంలో ఒక్కసారిగా ఎల్లయ్య భార్య, కూతురు కుమారుడు కంటనీరు పెట్టుకోవడంతో అక్కడ ఉన్న అందరి హృదయాలను కలచివేసింది.