మూవీ లవర్స్​కు బిగ్ షాక్ - తెలంగాణలో 10 రోజులపాటు థియేటర్లు బంద్

మూవీ లవర్స్​కు బిగ్ షాక్ - తెలంగాణలో  10 రోజులపాటు థియేటర్లు బంద్

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పది రోజులపాటు థియేటర్లు బంద్ కానున్నాయి. అక్యుపెన్సి తక్కువ ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి.

శుక్రవారం నుంచి పది రోజులపాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో సినిమా హాళ్ళకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందని… తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.