బిటి రోడ్డు సౌకర్యం ఉన్న– ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు

బిటి రోడ్డు సౌకర్యం ఉన్న– ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు

ముద్ర వీపనగండ్ల:-పెబ్బేరు నుంచి గోవర్ధనగిరి వీపనగండ్ల గ్రామాల మీదుగా కొల్లాపూర్ కి వెళ్లే ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం గోవర్ధనగిరి నుంచి  మీదుగా వీపనగండ్ల వరకు ఎనిమిది కిలోమీటర్ల రహదారి పూర్తిగా పూర్తిగా పాడవడంతో ఈ రహదారి వెంట కొల్లాపూర్ డిపో, వనపర్తి డిపో ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు. దీనితో గోపాల్ దీన్నే ప్రజలు పెబ్బేర్  వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు గోవర్ధనగిరి వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి వాహనాలలో పెబ్బేరు వెళుతున్నారు.వీపనగండ్ల ప్రజలు అమ్మాయిపల్లి కి వెళ్లి అక్కడి నుంచి వాహనాలలో పెబ్బేరు వెళ్తున్నారు.గోవర్ధనగిరి నుంచి వీపనగండ్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గోవర్ధనగిరి గోపల్దిన్నె గ్రామాల ప్రజలు కార్యాలయ పనులు నిమిత్తం ద్విచక్ర వాహనాలు లేదా నడుచుకుంటూ వచ్చేవారు.

అయితే గత ఆరు నెలల క్రితమే గోవర్ధనగిరి నుంచి వీపనగండ్ల వరకు బిటి రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం గోవర్ధనగిరి సమీపంలోని కల్వర్టు వద్ద రోడ్డు బాగు లేదంటూ బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రోడ్డు వెంట నిత్యం లారీలు, స్కూల్ బస్సులు జీపులు వెళుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు నడపకపోవటం ఉంటేనే ప్రశ్నిస్తున్నారు. శనివారం గోవర్ధనగిరి సమీపంలోని కల్వర్టు వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు చేపట్టి  ఇబ్బందులు లేకుండా చేశారు. ఇప్పటికైనా కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపో అధికారులు పెబ్బేరు నుంచి గోవర్ధనగిరి గోపాలదిన్నె వీపనగండ్ల గ్రామాల మీదుగా కొల్లాపూర్ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.