కొండగట్టు వసతిగదుల్లో చోరీకి పాల్పడ్డ దొంగల అరెస్ట్...

కొండగట్టు వసతిగదుల్లో చోరీకి పాల్పడ్డ దొంగల అరెస్ట్...
  • వివరాలు వెల్లడించిన డి ఎస్పీ ప్రకాష్
  • 3 మొబైల్స్, 4 వేల నగదు స్వాదినం

ముద్ర, మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయ వసతి గదుల్లో మంగళవారం తెల్లవారు జామున చోరీకి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ తెలిపారు. బుధవారం  మల్యాల ఠాణలో ఆయన విలేకరులకు చోరీ వివరాలు వెల్లడించారు. వేములవాడ ప్రాంతానికి చెందిన దూలం శశాంక్ (19), తోకల నితిన్(19), ఎనుగుందుల పవన్ చందు(20) మరో ఇద్దరు మైనర్స్ మొత్తం ఐదుగురు జల్సాలకు అలవాటు పడ్డారు. హోలీ రోజు దొంగతనం చేయాలని ఉద్దేశంతో TS 09 EV 8706 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు (కిరాయి) తీసుకోని ఈ నెల 6న కొండగట్టు వచ్చారు. 7 న మంగళవారం రద్దీ ఉన్న క్రమంలో తెల్లవారుజామున ఆలయ సమీపంలోని మారుతి కాటేజ్ వసతి గదులు 11,16,17లలో తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 7, 8 గంటల ప్రాంతంలో దర్శనం ముగించుకొని భక్తులు వచ్చి చూసేసరికి తమ గదుల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందించడంతో ఎస్ ఐ చిరంజీవి అక్కడికి చేరుకునేసరికి వారు పరారయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహాపల్లె గ్రామానికి చెందిన సందనవేణి సంతోష్ ( రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తి ) ఇచ్చిన పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసినట్లు తెలిపారు. సిసి పుటేజ్ ఆదరంగా... సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ ఐ చిరంజీవి, పోలీస్ బృందం రంగలోకి దిగి, బుధవారం ఉదయం కొండగట్టు సమీపంలోని దొంగలమర్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో వెళ్తున్న నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురిలో ఇద్దరు మైనర్లు కావడం వల్ల ముగ్గురిని అరెస్ట్ చేసి, కారుతో సహా, 3 మొబైల్స్, 4 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైన పేర్కొన్న A1శాశoక్ పై అర్మ్స్ యాక్ట్ , A2 నితిన్ పై పొక్స్  కేసులు ఇదివరకే ఉన్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ గారి సూచనలు, ఆదేశాల మేరకు 24 గంటల్లో కేసు చేదిoచిన సిఐ, ఎస్ ఐ, పోలీస్ బృందాన్ని డి ఎస్పీ అభినందించారు. ఇకపై కొండపైన భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అవుట్ పోస్ట్ లో సిబ్బంది సంఖ్య పెంచనున్నట్లు పేర్కొన్నారు. అలాగే  వ్యాసనాలకు, జల్సాలకు అలవాటు పడి యువత తప్పు ద్రోవ పట్టద్దన్నారు. కాగా, అంతకుముందు డి ఎస్పీ ప్రకాష్ కొండపైకి వెళ్లి అవుట్ పోస్ట్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. 12 గంటలు డ్యూటీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీ ఐ రమణమూర్తి, ఎస్ ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.