నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

నేడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్బంగా భువనగిరి పురపాలక సంఘ కార్యాలయములోని కౌన్సిల్ హాల్ యందు గౌరవ చైర్ పర్సన్ శ్రీ ఎన్నబోయిన అంజనేయులు, గౌరవ వైస్ చైర్ పర్సన్ శ్రీ చింతల కిష్టయ్య, శ్రీయుత మునిసిపల్ కమీషనర్ శ్రీ బి. నాగిరెడ్డి వారి ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ వార్డు సభ్యులు శ్రీ పంగరెక్క స్వామి, శ్రీ పోత్నక్ ప్రమోద్ కుమార్, శ్రీ కైరంకొండ వెంకటేష్, శ్రీ బానోత్ వెంకట్ నర్సింగ్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు శ్రీ రాచమల్ల రమేష్, అధికారులు, నాయకులు శ్రీ తుమ్మల పాండు గారు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.