టెట్ - 2023 అర్హత పరీక్షకు వికారాబాద్ జిల్లాలో మొత్తం 25 పరీక్ష కేంద్రాలు

టెట్ - 2023 అర్హత పరీక్షకు వికారాబాద్ జిల్లాలో మొత్తం 25 పరీక్ష కేంద్రాలు
  • పేపర్ - 1 కు 5765 మంది, అలాగే పేపర్ - 2 కు 3846 మంది అభ్యర్థులు
  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-ఈ నేల 15 న జరగబోయే టెట్ - 2023 అర్హత పరీక్షకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో మొత్తం 25 పరీక్ష కేంద్రాలలో పేపర్ - 1 కు 5765 మంది, అలాగే పేపర్ - 2 కు 3846 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  ఒక ప్రకటనలో తెలియజేశారు.

పరీక్ష రాయబోయే అభ్యర్థులు ఈనెల 15 నాడు ఉదయం 9:30 గంటలలోపు పరీక్ష హాలులోకి, అలాగే మధ్యాహ్నం జరగబోయే పరీక్షకు 2.30 నిమిషాల్లోపు మాత్రమే అనుమతించడం జరుగుతుంది ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించబడదని, అభ్యర్థులు ఎవరు కూడా పరీక్షల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు సెల్ ఫోన్ లను తీసుకురాకూడదన్నారు. పరీక్ష హాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన యాక్ట్ 25/97 ప్రకారం శిక్షార్హులు అవుతారు. టెట్ -2023 పరీక్షకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నచో 08416 - 254964 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయగలరు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని, సంబంధిత అధికారులందరికీ సమావేశాన్ని నిర్వహించి పరీక్షను పకడ్బందీగా  నిర్వహించుటకు గాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు, పలు రకాల సూచనలు ఇచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెలడించారు.