గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా  క్రీడాకారులను వెలికితీయడానికి  టోర్నీలు వేదికగా  ఉపయోగపడాతాయే

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా  క్రీడాకారులను వెలికితీయడానికి  టోర్నీలు వేదికగా  ఉపయోగపడాతాయే
  • రైకంటి రమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్  ప్రారంభించిన షాద్‌నగర్ సీఐ ప్రతాప లింగం

ముద్ర, షాద్‌నగర్:- గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారని వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నీలో వేదికగా మారుతాయని షాద్‌నగర్ సీఐ ప్రతాప లింగం అన్నారు.రైకంటి రమేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప లింగం ముఖ్యఅతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ  బ్యాటింగ్ చేసి యువతలో ఉత్సాహం నింపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు దేహదారిగాన్ని పెంపొందించడంతోపాటు మానసిక వికాసాన్ని కలిగిస్తాయని అన్నారు  ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఈ వేడుకల ను సద్వినియోగం చేసుకొని సత్తా చాటి ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు. స్నేహ పూర్వక వాతావరణంలో పోటీలు ఉండాలని గెలుపు ఓటములు తో కృంగిపోరాదని ఓటమి ప్రతి గెలుపుకు నాది కావాలని క్రీడా స్ఫూర్తితో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు మున్నా, మతిన్,కెషు,లక్ష్మణ్,శివ.మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.