మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో సీఐ ల బదిలీ

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో సీఐ ల బదిలీ
Transfer of CIs in Manchiryala and Asifabad district

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల సీఐ.నారాయణ నాయక్ బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కి బదిలీ కాగా ఆయన స్థానంలో బెల్లం పల్లి లో పని చేస్తున్న రాజును మంచిర్యాల సీఐ గా బదిలీ చేశారు.

అలాగే లక్షెట్టిపేట సీఐ కరీముళ్ల ను ఐ జీ ఆఫీస్ కు అటాచ్ చేయగా ఆయన స్థానంలో రామగుండం సీపీ కార్యాలయంలో పని చేస్తున్న కృష్ణారెడ్డి ని లక్షెట్టిపేటకు బదిలీ చేశారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ టౌన్ సీఐ.రవీందర్ ఐ జీ ఆఫీస్ కు అటాచ్ చేయగా ఆయన స్థానంలో బెజ్జుర్ సీఐ.బుద్దె స్వామికి పోస్టింగ్ ఇచ్చారు.