ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వలు జారీ చేశారు.గుంటూరు కలెక్టర్‌గా ఎస్. నాగలక్ష్మి నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఎ.ఎస్. దినేశ్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక విశాఖ కలెక్టర్ మల్లికార్జుననను జీఏడీకి అటాచ్ చేసింది. విశాఖ జిల్లా జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాకినాడ కలెక్టర్‌గా పగిలి షన్మోహన్, ప్రస్తుతమున్న కలెక్టర్ నివాస్‌ను జేఏడీకి అటాచ్ చేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె. వెట్రీ సెల్వీని బదిలీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్‌ను జీఏడీకి అటాచ్ చేసింది.

ఐఏఎస్‌ల బదిలీ లిస్ట్...

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి
ప్రస్తుతం గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు
విశాఖ జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి నియామకం
అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత బదిలీ
అల్లూరి కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ నియామకం
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్‌.అంబేడ్కర్‌
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్‌
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా
బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు