ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు అనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలు అత్యుత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. కాగా నిర్మల్ పట్టణంలోని గాజుల పేట్ పోలింగ్ కేంద్రంలో పలువురు ట్రాన్స్ జెండర్లు ఓటువేసి తమ బాధ్యత నిర్వర్తించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు వేయటం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.