పోలీసుల తనిఖీల మధ్య ప్రయాణాలు

పోలీసుల తనిఖీల మధ్య ప్రయాణాలు
  • ఎటు వెళ్లినా తప్పని తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రజలకు ప్రయాణాలు చేయాలంటే ఎన్ని మార్లు పోలీసు తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని హడలి పోతున్నారు. కారు ప్రయాణాలే కాదు, బస్సు ప్రయాణం కూడా తనిఖీలు లేకుండా జరగని స్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు చేతులు మారకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసు అధికారులు తనిఖీ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఎన్నికలు  సజావుగా సాగేందుకు సరైన చర్య అయినప్పటికీ, ఇందువల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు తమ లగేజిలు పోలీసులు తనిఖీ చేయటం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారు. ఇలా మహిళల బ్యాగులను తనిఖీ చేయించే సమయంలో మహిళా పోలీసుల సహాయం తీసుకుంటే బాగుంటుందని పలువురు మహిళలు అంటున్నారు.