ధరణి ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ట్రెసా కృషి అభినందనీయం  

ధరణి ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ట్రెసా కృషి అభినందనీయం  

ముద్ర న్యూస్, నేరెడుచర్ల:- వీఆర్వోలు వీఆర్ఏలు ధరణి ఆపరేటర్లు మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ట్రెస్సా  కృషి చేస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమని తమ సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ధరణి ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నగాని పురుషోత్తం చెప్పారు. ట్రెసా ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల హక్కులు,సంక్షేమం కోసం,అలాగే డిప్యూటీ కలెక్టర్ నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు వివిధ కేడర్ల పదోన్నతులు, బదిలీల వంటి అన్ని రకాల సమస్యలను పరిష్కారించటంలో ట్రెసా చేసిన నిర్మాణాత్మకమైన కృషితో పాటు రెవెన్యూ శాఖ మనుగడ కోసం ట్రెసా చేస్తున్న కృషిని ప్రస్తావించడం జరిగిందన్నారు. ఇంకా చేయాల్సిన పనులను,ముఖ్యంగా కొత్త ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ క్షేత్ర స్థాయి సిబ్బంది పెంపు,  గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడంతో పాటు వీఆర్ఓ,వీఆర్ఏల,ధరణి ఆపరేటర్లు, మీ సేవ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరింస్తామని ప్రస్తావించినందుకు ధరణి ఆపరేటర్ల సంఘం తరపున ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ కి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ లకు  కృతజ్ఞతలు  చెబుతున్నామని పురుషోత్తం వెల్లడించారు.