Donald Trump - మరోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం..

Donald Trump - మరోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం..

నూతన అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారం చేపట్టనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ దాటారు. దీంతో పలు దేశా అధినేతలు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ సైతం ట్రప్ విజయం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.తన విజయం ఖాయం అని భావించిన తర్వాత ట్రంప్ యూఎస్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికాను గొప్పగా మార్చడానికి నేను ప్రతి శక్తిని, ఆత్మను, అగ్నిని తీసుకువస్తాను. నేను యుద్ధాలను ఆపబోతున్నాను” అని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ చెప్పారు. “మా విమర్శకులు తప్పు అని మేము నిరూపించాము. ఇది అమెరికాకు స్వర్ణయుగం అవుతుంది” అని ట్రంప్ అన్నారు.

అమెరికాలోని “కష్టపడి పనిచేసే” ప్రజల మద్దతు కోసం తమ పార్టీ తిరిగి చెల్లిస్తుందని, మెరుగైన జీవన పరిస్థితులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ దేశంపై మళ్లీ పట్టు సాధించారని ఆయన అన్నారు. “ఇది చాలా గొప్ప పని. ఇలాంటి ఉద్యోగం లేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఉద్యోగం. నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా నన్ను ఏదీ అడ్డుకోదు” అన్నారాయన.