భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
  • మే 1న తుంగతుర్తి లో జరిగే కాంగ్రెస్ పార్టీ ర్యాలీని విజయవంతం చేయాలి
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి ముద్ర:- రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చా మల కిరణ్ కుమార్ రెడ్డి నిఅత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తుంగతుర్తి మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రకాశం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే మెజార్టీ నియోజకవర్గం నుండి 60 వేల నుండి 70 వేలకు పెరగాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గడిచిన నాలుగు మాసాల్లోనే నియోజకవర్గంలో సుమారు 150 కోట్లకు పైగా అభివృద్ధి నిధులతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గం గడిచిన 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని నియోజకవర్గ పరిధిలోని రవాణా వ్యవస్థ పూర్తిగా శిథిలమైపోయిందని అన్నారు.

విద్యా వైద్య ఆరోగ్య రంగాల్లో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ప్రజలు అభివృద్ధి కోసం తహతలాడారని అన్నారు .అందుకే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కసితో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు పెట్టిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు అందర్నీ సమైక్యపరిచి అందరిని కలుపుకొని అభివృద్ధి పథంలోకి నియోజకవర్గాన్ని తీసుకెళ్తామని అన్నారు. మే 1న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం భారీ ర్యాలీ నిర్వహించనున్నామని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చా మల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరవుతున్నారని అన్నారు. తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయిలో కదిలి రావాలని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు .ఈ సమావేశంలో పీసీసీ మెంబర్ గుడిపాటి నరసయ్య ,తుంగతుర్తి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ సామ అభిషేక్ రెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడ్డి కృష్ణమూర్తి పెద్ద బోయిన అజయ్ కుమార్ వీరబోయిన రాంబాబు ఓరుగంటి సత్యనారాయణ లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు