తిరుమలగిరి సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్

తిరుమలగిరి సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్
  • పోలియో నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు విధిగా వేయించాలి

తుంగతుర్తి ముద్ర:-పోలియో వ్యాధి నివారణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలియో సెంటర్లో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో వ్యాధి వలన ఎంతో మంది పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతున్నారని ఆ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు అందులో భాగంగా 0 నుండి 5 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు విధిగా ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి గ్రామం ప్రతి మండల కేంద్రంలో ప్రతి సెంటర్లో పోలియో చుక్కలు వైద్య ఆరోగ్య సిబ్బంది వేస్తున్నారని ఈ అవకాశాన్ని చిన్నపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట వైద్యాధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు