తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన ధ్యేయం

తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన ధ్యేయం
  • అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 150 కోట్ల అభివృద్ధి పనులు
  • గత దశాబ్ద కాలంగా జీర్ణమైన తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన రహదారులను కోట్లాది రూపాయలతో పునరుద్ధరణ
  • నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సిసి రోడ్ల నిర్మాణం
  • తుంగతుర్తి నియోజకవర్గం లో విద్య వైద్య రవాణా రంగాల పూర్తిస్థాయి అభివృద్ధికి కృషి
  • వరి ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు సెంటర్లో వారు ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దు
  • భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల మెజార్టీ కన్నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి
  • తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్


తుంగతుర్తి ముద్ర:-భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడచిన దశాబ్ద కాలంగా తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా బ్రష్టు పట్టిందని రోడ్లు జీర్ణవస్థకు చేరుకున్నాయని విద్య వైద్య రంగాలు కుంటుపడ్డాయని అన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి కాంక్షతో కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో తనను 50000 మెజార్టీ కి పైగా ఓట్లతో గెలిపించారని అందుకు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానని అన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది మాసాల్లోనే సుమారు 150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. మోత్కూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించారని365 జాతీయ రహదారి నుండి తుంగతుర్తి మీదుగా రావులపల్లి వరకు 16 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ని ఒప్పించి నిధులు మంజూరు చేయించి భూమి పూజ చేసి పనులు ప్రారంభించామని అన్నారు .అలాగే తిమ్మాపురం కోడూరు కొమ్మల సంఘం చిల్పకుంట మీదుగా నూతనకల్ వరకు 33 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల రోడ్లు శిథిలమయ్యాయి అని  ఆయా గ్రామాలకుకోట్లాది రూపాయల వ్యయంతో రోడ్లు మంజూరు చేయించామని అన్నారు. అంతేగాక గ్రామాల్లో మౌలిక సదుపాయం కల్పించడంలో భాగంగా సిసి రోడ్లు వేసామని అన్నారు .గురుకుల పాఠశాలలో వసతులు కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులతో పాటు వారికి కావలసిన అవసరాలను లక్షలాది రూపాయల వ్యయంతో సమకూర్చామని అన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు .గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఏ విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు అంతకన్నా ఎక్కువ మెజార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి వచ్చేలా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ఈనెల 14న తిరుమలగిరిలో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సుమారు 6 నుండి 7000 మంది కార్యకర్తలు హాజరు కానున్నారని ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరారు .ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి రాజయ్య  తిరుమలగిరి మోత్కూరు మున్సిపల్ చైర్మన్ లు ,అలాగే వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.