బద్రీనాథ్ నుంచి తిరిగొస్తూ ఇద్దరు హైదరాబాదీలు మృతి

బద్రీనాథ్ నుంచి తిరిగొస్తూ ఇద్దరు హైదరాబాదీలు మృతి

UTTARAKHAND: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ లో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఇద్దరు హైదరాబాదీలు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి మోటారు బైక్ పై వస్తుండగా కొండచరియలు విరిగిపడి ఈ ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసిన పోలీసులు పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని హైదరాబాద్ కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50)గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ పై కొండచరియలు విరిగి పడ్డంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని పోలీసులు వెల్లడించారు.