పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం..

పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం..

  • తీవ్రంగా గాయపడిన వరి కోత యంత్రం డ్రైవర్
  • యాలాల మండలం జుంటుపల్లి సమీపంలో ఘటన

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్ :వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ యాలాల మండలం జుంటుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో పాటు పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆపస్మారక స్థితికి చేరాడు. జుంటుపల్లి గ్రామానికి చెందిన హరిజన కొనింటి లక్ష్మయ్య(50) తన పొలంలో వరి కోతలు కోసేందుకు ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్ (26)కలిసి వెళ్లగా అకస్మాత్తుగా భారీ వర్షంతో కూడిన పిడుగులు పడ్డాయి. వరి కోత కోసే యంత్రం డ్రైవర్ కూడా పిడుగుపాటుకు తీవ్రంగా పాలైనాడు. జుంటుపల్లి గ్రామానికి చెందిన దంతల వాడ సమీపంలో చోటు చేసుకున్నారు ఈ ఘటనతో జుంటుపల్లి గ్రామంలో విషాద చ్చాయలు అలుముకున్నాయి.