రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి...

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామరెడ్డి పల్లి గ్రామ స్టేజి వద్ద బుధవారం అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద వనపర్తి డిపోకి చెందిన TS 32 T 5577 ఆర్టిసి బస్సు పామిరెడ్డిపల్లి పల్లి గ్రామానికి చెందిన బోయ అశోక్, బోయ చందు TS 07 EF 4528 ద్విచక్ర వాహనంపై వనపర్తికి వెళుతుండగా ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న ద్విచక్ర వాహనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు.