కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
  • వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ముద్ర.వనపర్తి:- కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రం అన్ని రంగాల లో అభివృద్ధి సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలోని గట్టుకాడి పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ నూతన భవన ప్రారంభం, నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రుక్కనపల్లి గ్రామంలో నర్సరీ, గ్రామపంచాయని కార్యాలయం నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో  గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణ నాయక్, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షులు వెంకట్రావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.