తుంగతుర్తి దొరలకు చరమ గీతం పాడాలి

- నిరుద్యోగ భృతి ఏమైంది.. కేజీ టు పీజీ చదువు ఎక్కడ ..?
- కళ్ళ ముందు జరిగే అన్యాయాలను చూడలేక బయటకి వచ్చా...
- 20వ (జమ్మిగడ్డ), 22వ (బర్లపెంట బజార్) వార్డులలో ఇంటింటి ప్రచారం
- బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ, బర్ల పెంట బజారు లలో బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం 1000 మంది కార్యకర్తలు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి బిఎస్పి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల పాలన కు విముక్తి కలగాలంటే మనం మారాలని, అందుకు ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.ప్రజల సొమ్మును దోచుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి ని ఓటు రూపంలో తరిమి కొట్టాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై బహుజన వాదాన్ని గెలిపించుకోవాలని, అందుకు ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, అన్నేపర్తి రాజేష్, ధరావత్ నిలాబాయి లింగా నాయక్, మాజీ కౌన్సిలర్ కుంభం రజిత నాగరాజు, మీర్ అక్బర్, మల్సుర్, నజీమా, మేడం వెంకన్న, కలమ్మ, విద్యo సతీష్ నాయుడు, గోనె సతీష్, నరేష్, రజిత, పద్మ, క్రాంతి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
బహుజన వాదాన్ని బలపరిచేందుకు బిఎస్పి లో భారీగా చేరికలు
రూప్లా తండా నుంచి 100 మంది,పాండ్యా నాయక్ తండ నుంచి 50 మంది చేరిక సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట రూరల్ మండలం రూప్లా తండా, చివ్వెంల మండలం పాండ్యా నాయక్ తండా లకు చెందిన 150 మంది కార్యకర్తలు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో ఆదివారం బిఎస్పి పార్టీలో చేరారు. రూప్లా తండా నుంచి వార్డు సభ్యులు చంద్ర, జయేందర్, లచ్చు, శ్రీరాములు, బాలు నాయక్, వెంకన్న, రాంబాబు, బలరాం నాయక్, అనిల్, రాజేష్, లింగా నాయక్, బాల, సైదులు, సందీప్,పాండ్యా నాయక్ తండ నుంచి సుక్కో, లక్ష్మణ్, శంకర్, రమేష్, బిక్షం, ధర్మ, చందు, కళ్యాణ్, నెహ్రూ తదితరులు పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు గడ్డం సైదులు, సుంకరబోయిన రాజు, దేశ బోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొట్లపాడు నుంచి బి ఎస్ పి లో చేరికలు
బహుజన వాది వట్టే జానయ్య యాదవ్ కి మద్దతు తెలపడానికి బిఎస్పీ పార్టీలో చేరుతున్నట్లు పెన్ పహాడ్ మండలంలోని పొట్లపాడు గ్రామానికి చెందిన యువకులు పేర్కొన్నారు.శనివారం పొట్లపాడు గ్రామానికి చెందిన పలువురు యువకులు ప్రచార భాగంలో గూడెపుకుంట తండాకు వచ్చిన బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సతీష్, నవీన్, భార్గవ్, నాగరాజు, రాము, రాంబాబు, మధు, కిరణ్, శ్రీను, మహేష్, చంటి, శరత్, రాకేష్, వంశీ తదితరులు పార్టీలో చేరారు.