వీపనగండ్ల ప్రభుత్వ బాలుర పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత

వీపనగండ్ల ప్రభుత్వ బాలుర పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత
  • కస్తూర్బా పాఠశాలలో 95% ఉత్తీర్ణత

ముద్ర/వీపనగండ్ల:- మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించగా, కస్తూర్బా పాఠశాలలో 95 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి అరుణ తెలిపారు.

బాలుర పాఠశాలలో 29 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారనిబత్తుల చరణ్ 9.5,అక్కల అఖిల 9.3,బత్తుల శివ 9.2,ఆవుల శ్రీకాంత్ 9.2,కోట్రా నీలిమ 9.0,శ్రీకాంత్ 9.0 జి పి ఏ సాధించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు, కస్తూర్బా పాఠశాలలో 41 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 39 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని భూమిక 9.5 తులసి 9.5, దేవిక 9.2, భానుమతి 9.2 జిపిఏ సాధించారని ప్రత్యేక అధికారి అరుణ తెలిపారు.