కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం

కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం

ముద్ర.వీపనగండ్ల:- కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీలో ఎప్పటికైనా సముచిత స్థానం లభిస్తుందని వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని ప్రజాభవన్ లొ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని, పార్టీ కొరకు చేసిన సేవలను గుర్తించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.