క్రీడా పోటీలతో స్నేహభావం మరింత పెరుగుతుంది – ఎస్ఐ కె రాణి

క్రీడా పోటీలతో స్నేహభావం మరింత పెరుగుతుంది  – ఎస్ఐ కె రాణి

ముద్ర.వీపనగండ్ల :- యువత క్రీడల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని,పోటీలతో స్నేహభావం మరింత పెరుగుతుందని వీపనగండ్ల ఎస్సై కే రాణి అన్నారు. మండల కేంద్రమైన వీపనగండ్ల లో దీపావళి గంగమ్మ జాతర సందర్భంగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న విపిఎల్ సీజన్ 4 క్రికెట్ పోటీలను ఎస్సై కే రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.

 క్రీడా పోటీల వల్ల స్నేహభావం మరింత పెరుగుతుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడాలని, క్రీడలను తాను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాల్ రెడ్డి, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఎత్తుం కృష్ణయ్య, ముంత మల్లయ్య యాదవ్, నాయకులు వెంకట్ రెడ్డి, బసవరాజ్ గౌడ్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, సంఘం వెంకటయ్య తదితరులు ఉన్నారు.