ఎంబిబిఎస్ సీట్లు సాధించిన వీపనగండ్ల విద్యార్థులు

ఎంబిబిఎస్ సీట్లు సాధించిన వీపనగండ్ల విద్యార్థులు

ముద్ర.వీపనగండ్ల :-వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నీట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించి మెడికల్ కళాశాలలో సీట్లను పొందారు. సోమవారం విడుదలైన కాలేజీల ప్రవేశాలలో గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు జోల్లు గంగులు-శ్యామల కుమారుడు అఖిల్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో, మేడిపల్లి నాగేశ్వర్ రెడ్డి–లావణ్య ల కూతురు యామిని రెడ్డి కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో, మునిగొండ గోపి–మాధవి ల కూతురు అఖిలా సంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాలలో సీట్లను పొందారు. ఓకే గ్రామం నుంచి ముగ్గురికి మెడికల్ కళాశాలలో సీట్లు రావడం పై తల్లిదండ్రులు,గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.వైద్యులుగా స్థిరపడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించటమే తమ లక్ష్యం అని ఎంబిబిఎస్ సీట్లు పొందిన విద్యార్థులు అఖిల్, యామిని రెడ్డి, అఖిల అన్నారు.