వాహన తనిఖీలు మరింత ముమ్మరం

వాహన తనిఖీలు మరింత ముమ్మరం
  •  పోలీసులకు అడిషనల్ డీసీపీ రవికుమార్ ఆదేశం
  • పోలీసులు వాహన తనిఖీని నిర్వహిస్తున్న సందర్భంలో పరిశీలిస్తున్న అదనపు డీసీపీ రవికుమార్

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: ఎన్నికల కోడ్ దృష్ట్యా పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాల్సిందిగా రాచకొండ కమిషనరేట్ అదనపు డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ పోలీసులను ఆదేశించారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీబీనగర్ పోలీసులకు పలు సూచననలు చేశారు. వాహనాల తనిఖీ సందర్భంలో తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా వాహనాలను నిశితంగా పరిశీలించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. 

వాహన తనిఖీల సమయంలో ఎక్కడా ప్రయాణికులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ చెక్ పోస్టులో ఎన్నికల కమిషన్ నియమించిన సిబ్బందితో పాటు పోలీసులు కూడా పనిచేస్తారు. కొండమడుగు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ద్వారా  అటు ఆలేరు నియోజకవర్గం నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, భువనగిరి నియోజకవర్గాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలను తనిఖీ చేయడానికి వీలవుతుంది. బీబీనగర్ మండల పరిధిలో కేవలం ఈ ఒక్క చోట మాత్రమే ఎన్నికల చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక చెక్ పోస్టులతో పాటు సాధారణ తనిఖీలు కూడా ఉంటాయని బీబీనగర్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్ గౌడ్ తెలిపారు. అడిషనల్ డీసీపీ రవికుమార్ వెంట తనిఖీలలో బీబీనగర్ పోలీసులతో పాటు, ఎన్నికల కమిషన్ సిబ్బంది కూడా ఉన్నారు.