భువనగిరి పార్లమెంట్ స్థానం బీసీలకు దక్కేనా?

భువనగిరి పార్లమెంట్ స్థానం బీసీలకు దక్కేనా?
  • బీసీ సామాజిక వర్గానికి చెందిన సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు భువనగిరి సీటు అధిష్టానం కేటాయిస్తుందా?
  • భువనగిరి పార్లమెంట్ స్థానం అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న చెవిటి వెంకన్న యాదవ్


తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉండగా ఒక స్థానాన్ని బీసీకి కేటాయించాలని నినాదం మొదటి నుండి వినవస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గా ప్రకటించడం మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం మరింత ఊపందుకుంది . తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఆరంగేట్రం చేసిన ప్రస్తుత సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పేరు ప్రముఖంగా వినవస్తుంది .

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగిన చెవిటి వెంకన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీలో అటు పార్టీ పదవులు ఇటు నామినేటెడ్ పదవులు నిర్వహించారు .ముఖ్యంగా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా రెండు దఫాలు ఎంపికై ఇలాంటి మచ్చ లేకుండా చైర్మన్గా కొనసాగారు. అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన నాటి నుండి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ సభ్యత్వాలు చేర్పించడంలో కూడా సూర్యాపేట జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా కృషి చేయడం చెవిటి వెంకన్న యాదవ్ కు మంచి పేరు తెచ్చింది . ఒకపక్క మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ మరోపక్క తన రాజకీయ పలుకుబడిని నియోజకవర్గంలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో పేరు సంపాదించారు.

నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాల్లో భువనగిరి పార్లమెంటు స్థానాన్ని బీసీల కేటాయించినట్లయితే దాదాపు చెవిటి వెంకన్న యాదవ్ పేరు ఖరారు అవుతుందనే మాట వినవస్తుంది. కాంగ్రెస్పార్టీలో అధికారం లేకుండా కొనసాగుతున్న కాలంలో నాడు అధికారంలో ఉన్న పార్టీ నుండి ఎన్ని రకాల ఆశలు పెట్టి వారు ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన చెవిటి వెంకన్న యాదవ్ కి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని పలువురు సీనియర్ నాయకులతో పాటు యువకులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంటు స్థానంపై ఢిల్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ నిర్వహించనున్నట్లు అందులో భాగంగా పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించి దిశగా అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే బీసీ నాయకుల్లో మంచిపట్టున్న చెవిటి వెంకన్న యాదవ్ కు భువనగిరి పార్లమెంటు స్థానం దక్కడం కాయంగా తెలుస్తుంది .ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో భువనగిరి పార్లమెంటు స్థానంపై క్లారిటీ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.