బీసీ కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌గా వెంకటేశ్వరరావు
- సహాయకుడిగా బి.సైదులు
- హైకోర్టు ఆదేశాలతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనల మేరకు డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర రావును కమిషన్ చైర్మన్ గా, మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్) గారు కమిషన్ కార్యదర్శిగా నియమించింది.
కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ నెల 3న పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. 24 గంటల్లోగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేరకు కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.