విజయ్ సేతుపతి విడుదల 2 పాట విడుదల
విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ హైలెట్ గా రూపొందిన చిత్రం విడుదల2.ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. కాగా ఈ చిత్రంలోని తొలి పాట ,"పావురమా పావురమా" అనే పాటను నిన్న విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ " సంగీత మాంత్రికుడు ఇళయరాజా స్వరపరిచిన ,"విడుదల 2" చిత్రంలోని తొలిపాటను నిన్న విడుదల చేయడం ఆనందంగా ఉంది. కాసర్ల శ్యామ్ కలం నుంచి వెలువడిన ఈ పాటను తెలుగు ప్రేక్షకులు ఇంత స్పీడుగా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా" విడుదల2 "ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది.
అలాగే ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రీ మారన్, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తో కలిసి ఈ చిత్రాన్ని అత్య ద్భుతంగా తెరకెక్కించారు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఈ చిత్ర హక్కులను మేము దక్కించుకున్నందుకు సంతోష పడుతున్నాం. డిసెంబర్ 20 న ఇండియన్ సెల్యూలాయిడ్ పై ప్రేక్షకులంతా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అని అన్నారు.
విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్,రాజీవ్ మీనన్, ఇలవరసు , బాలాజీ శక్తివేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, డి ఓ పి: వేల్ రాజ్, ఎడిటింగ్: ఆర్ : రామర్, పి ఆర్ ఓ: బి. వీరబాబు, దర్శకత్వం: వెట్రి మారన్, నిర్మాతలు: ఎల్ రెడ్ కుమార్
చింతపల్లి రామారావు (తెలుగు వెర్షన్)