కాంగ్రెస్ కు మద్దతుగా విజయశాంతి ప్రచారం

కాంగ్రెస్ కు మద్దతుగా విజయశాంతి ప్రచారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు కు మద్దతుగా కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయ శాంతి నిర్మల్ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా సారంగాపూర్, దిలావర్ పూర్ మండలాల్లో ప్రచారం చేస్తూ ప్రజల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు అధికార పార్టీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని విమర్శించారు ఇదే బాటలో బిజెపి కూడా పయనిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి శ్రీ హరి రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు