మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచిన వియ్యపురాళ్లు 

మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచిన వియ్యపురాళ్లు 

ముద్ర హైదరాబాద్: తాము బతికి ఉన్న కాలంలో కలిసిమెలిసి ఉంటూ మరణానంతరం వెయ్యపురాళ్లు ఒకే ఇంట సుమారు 25 ఏళ్ల పాటు జీవనం సాగించి మరణానంతరం వైద్య విద్యార్థులకు విజ్ఞానం అందించేందుకు తమ భౌతిక కాయాలను విద్యార్థుల పరిశోధన కోసం వీలునామా రాయడం ఒక గొప్ప విషయమని రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ వాణి అన్నారు.

ఖాజా గూడా లో నివాసం ఉంటున్న ఈడుపుగంటి వెంకటరత్నమ్మ (92) వెంకనేని హైమావతి (78) ఇద్దరు వెయ్యపురాళ్లు వీరు 25 ఏళ్ల పాటు ఒకే ఇంట కలిసి జీవించారు. అనంతరం వెంకటరత్నమ్మ ఈనెల 5న మరణించారు. ఆమె జీవించి ఉండగానే తన మరణానంతరం తన పార్టీవదేహాన్ని వైద్య విద్యార్థులకు అనాటమీ కోసం ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించాలని వీలునామా రాశారు. ఆమె రాసిన ప్రకారం వెంకట రత్నమ్మ పార్థివదేహాన్ని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు అప్పగించారు. అనంతరం ఆమెను ఆదర్శంగా తీసుకొని హైమావతి తన మరణానంతరం వైద్య కళాశాలకు తన పార్థివదేహాన్ని అప్పగించాలని వీలునామా రాశారు. వెంకటరత్నం మరణించిన ఐదు రోజుల తర్వాత హైమావతి మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె పార్దివదేహాన్ని ఆసుపత్రికి అందజేశారు.

వెంకటరత్నమ్మ హైమావతి సంస్మరణ సభను వారి కుటుంబ సభ్యులు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వాణి ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. వియ్యపురాళ్ళు ఇద్దరు 25 ఏళ్ల పాటు ఒకే ఇంటిలో కలిసి జీవించి ఉండడం అభినందనీయం అన్నారు. అదేవిధంగా మరణానంతరం ఇద్దరు తమ పార్టీవదేహాలను వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలని నిర్ణయం తీసుకొని ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ వైజయంతి రావు, ఉస్మానియా డెంటల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జై కుమార్ ,ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ దయానంద స్వామీజీ, పిరమిడ్ మెడిటేషన్ సొసైటీ ప్రమోటర్ సురేష్ బాబు, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, రమాదేవి తో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రతాప్ బంధుమిత్రులు పాల్గొని వారికి నివాళులర్పించారు.