జర్నలిజానికి నిజమైన మార్గదర్శి రామోజీరావు

జర్నలిజానికి నిజమైన మార్గదర్శి రామోజీరావు
  • వనపర్తి జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షుడు - గుండ్రాతి మధు గౌడ్
  • రామోజీరావు మృతి పట్ల సంతాపం ప్రకటించిన జిల్లా జర్నలిస్టులు

ముద్ర. వనపర్తి:-జర్నలిజానికి నిజమైన మార్గదర్శి రామోజీరావు అని, ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుకే దక్కిందని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ తన సంతాపాన్ని తెలియజేశారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు తుది శ్వాస విడిచారు. దీంతో జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ నాయకులు రామోజీరావు మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో గుండ్రాతి మధు గౌడ్ తన సంతాపాన్ని తెలియజేస్తూ... ప్రముఖ పత్రిక సంపాదకుడు, వ్యాపారవేత, సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు మృతి చెందడం జర్నలిజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

పత్రిక ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్న మహోన్నతుడు రామోజీరావు అని తెలిపారు. మంచితనం ఉన్నన్నాళ్లు, న్యాయపోరాటం నాలుగు పాదాలపై నిలబడినన్ని నాళ్ళు రామోజీరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని తెలియజేశారు. కష్టే ఫలి అని నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ నేడు వేల మందికి ఉపాధి కల్పించి, నూతన మొరవాడిని సృష్టించాడని కొనియాడారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలియజేసిన వారిలో,జిల్లా ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూజే (ఐజేయు).డి. మాధవరావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు టీయూడబ్ల్యూజే (ఐజేయు) నోముల రవీందర్ రెడ్డి,జాతీయ కౌన్సిల్ సభ్యులు టీయుడబ్ల్యూజే (ఐజేయు)కొంతం ప్రశాంత్,స్టేట్ కౌన్సిల్ సభ్యుడు టీయూడబ్ల్యూజే (ఐజేయు)బొలెమోని రమేష్,ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్ గౌడ్,శివకుమార్ ఉన్నారు.