బెడమ్ బావి పూడికతీత పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో  కే,గిరిబాబు

బెడమ్ బావి పూడికతీత పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో  కే,గిరిబాబు
  •  నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి.

చిలుకూరు, ముద్ర : మండల కేంద్రంలోని జేజే నగర్ కాలనీలో పురాతనమైన బేడమ్  బావి పూడికతీత పనులను గురువారం ఎంపీడీవో గిరిబాబు, పంచాయతీ సెక్రెటరీ  షరీఫుద్దీన్,తో కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, బావి లో నీరు అడుగంటి పోయాయని  అందువల్ల క్రేన్ తో పూడికతీత పనులు ప్రారంభించామని  కాలనీలో నీటి ఎద్దడి రాకుండా  చర్యలు తీసుకున్నామని, ఇంకో మోటార్ ద్వారా కాలనీకి నీరు అందిస్తున్నామని, పూడికతీత పనులు పూర్తికాగానే బావి మోటార్ నుంచి కూడా నీరు అందిస్తామని, వేసవికాలం నీటి కొరత తీవ్రంగా ఏర్పడే  అవకాశం ఉన్నందున, భూగర్భ జలాలు అడుగంటి పోయాయని  బోర్లలో బావులలో నీరు లేవని,నీటిని వృధా చేయకుండా నల్లాలకు ట్యాపులు   పెట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఆయన వెంట బిల్లు కలెక్టర్ ధర్మయ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,