బండి పై కన్నం అంజయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

బండి పై కన్నం అంజయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
BJP Dalit Morcha State General Secretary Kummari Shankar

బిజెపి దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ 

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపి నాయకులు కన్నం అంజయ్య  రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. బిజెపి దళిత మోర్చా కన్నం అంజయ్యకు దళితులపై ఇప్పుడే ఎనలేని ప్రేమ ఎందుకు వచ్చింది అంజయ్య ఎప్పుడైనా దళితుల సమస్యల కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత కన్నం అంజయ్యకు లేదని విమర్శించారు. మంగళవారం కరీంనగర్ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల  సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో దళిత మోర్చా పటిష్టంగా ఉందని, దళితుల సమస్యల కోసం పోరాటం చేసిందన్నారు. బిజెపిలో దళిత ప్రతినిధులు అంతా సమిష్టి గా పనిచేస్తూ, దళిత సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం చేస్తుందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సారథ్యంలో దళిత మార్చ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన కన్నం అంజయ్య   బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన వ్యక్తి పదవుల కోసం దిగజారిపోయి బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలిసిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. పార్టీకి దళిత ప్రతినిదులకు గా  సముచిత స్థానం దక్కిందని పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి  బండి సంజయ్ కుమార్ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. పనిగట్టుకుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై అక్కసు వెళ్ళగక్కడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.


భారతీయ జనతా పార్టీలో నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే విషయాలు మర్చిపోయి  వ్యక్తిగతమే  ఫస్ట్ అనే విధంగా కన్నం అంజయ్య వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా మారిందని, అలాంటి పార్టీని బలహీనం చేయడానికి మీలాంటి సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మి నారాయణ, ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు, రాష్ట్రా అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి, దిశ కమిటీ మెంబర్ జానపట్ల స్వామి,బీజేపీ సీనియర్ నాయకులు  మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడి చైతన్య, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పుల్లమల్ల ప్రసాద్,తూర్పటి  రాజు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ఇసారి  జాశ్వంత్,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎలుక  రాజేష్, ఎస్సీ మోర్చా మానకొండూర్ మండల  అధ్యక్షులు శ్రీహరి, ఎస్సీ మోర్చా నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.