మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం

మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
  • ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం లక్ష్యం
  • లిఫ్ట్ ల పునరుద్ధరణ తో రైతుల జీవితాల్లో వెలుగు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని ఉప ముఖ్య మంత్రి బట్టి విక్ర మార్గ అన్నారు. శనివారం హుజూర్ నగర్ నియోజక వర్గంలోని మేల్లచెర్వు మండలం నక్క గూడెం లో లిఫ్ట్ పునరుద్ధరణ కు రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తో కలసి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్బంగా  ఉప ముఖ్యమంత్రి బట్టి విక్ర మార్క మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నక్క గూడెం లిఫ్ట్  పునరుద్ధరణ ద్వారా ఈ ప్రాంతంలో 3200 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని అన్నారు. ఈ లిఫ్ట్ మరమ్మత్తులకు దాదాపు 35 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అలాగే ఈ ప్రాంత రోడ్లలు చేపట్టుటకు మరో 40 కోట్లు అందించనున్నట్లు తెలిపారు.

 గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్లు, లిఫ్ట్ లు  గత పాలకుల మరమ్మత్తులు చేపట్టక పోవడం  వలన ఈ ప్రాంతం  పూర్తిగా ఎడారిగా మారిందని ఇకపై ఇందిరమ్మ పాలనలో అన్ని లిఫ్ట్ లు , రోడ్లు చేపడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వలన రైతులకు మేలు జరగలేదని కోట్ల రూపాయల ప్రజా ధనం  వృధా అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని , ఇకపై రాష్ట్రంలోని  మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు  పక్కా గా అందిస్తామని అలాగే రాష్ట్రంలో సంపద, వనరులు ప్రజలకే అందాలని  ప్రభుత్వం ఆదిశగా దృఢ సంకల్పంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం తెచ్చి గిరిజనులకు పొడు పట్టాలు అందించాని అలాగే త్వరలో ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

రాష్ట్ర నీటి పారుదల , పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన లిఫ్ట్ లు, రోడ్లు ఈ ప్రాంతంలో  కనబడుతున్నాయని 10 సంవత్సరాలు కొనసాగిన ప్రభుత్వం  ప్రజలు, రైతులు ఎంతో నష్ట పోయారని విమర్శించారు.   కాళేశ్వరం సమస్యలు చెప్పలేన్నని ఉన్నాయని ప్రజా ధనం ఎంతో దుబారా జరిగిందని అన్నారు. ఈ నెల 27 న త్వరలో మరో రెండు పథకాలు  సి.ఎం. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ. 500 లకు గ్యాస్ సిలెండర్, పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తామని అన్నారు.రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన సేవలందించాలని గత ప్రభుత్వం ప్రజలకు మెప్పించి  చేపట్టిన పనుల్లో కమిషన్లు కక్కుర్తి పడ్డారని  పేర్కొన్నారు. లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంత రైతాంగ సాగు గణనీయంగా పెరుగుతుందని అలాగే త్వరలో రోడ్లను చేపట్టనున్నట్లు  పేర్కొన్నారు.

తదుపరి దొండపాడు లో రూ. 400 కోట్లతో చేపట్టే ఇన్నోవేరా ప్యాక్టరీ నిర్మాణానికి  సహచర మంత్రులతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, యస్.పి. రాహుల్ హెగ్డే, నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ రమేష్,   అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, అదనపు ఎస్.పి నాగేశ్వర రావు, ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, వివిధ శాఖల అధికారులు,  ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.